తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాకు మాస్క్​ల ఎగుమతిపై నిషేధం ఎత్తివేత​ - Indian Ambassador to China Vikram Misri

చైనాకు మాస్క్​ల ఎగుమతిపై విధించిన నిషేధాన్ని ఎత్తేసింది కేంద్ర ప్రభుత్వం​​. వందలాది మంది ప్రాణాలు బలిగొన్న కరోనా వైరస్​తో పోరాడుతున్న చైనాకు సాయం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

India lifts ban, clears some medial gear exports to China to combat coronavirus
చైనాకు మాస్క్​ల ఎగుమతిపై నిషేధం ఎత్తివేత​

By

Published : Feb 10, 2020, 10:06 PM IST

Updated : Feb 29, 2020, 10:10 PM IST

చైనాకు మాస్క్​లతో పాటు అన్ని రకాల వ్యక్తిగత రక్షణ, కొన్ని వైద్య పరికరాలపై విధించిన నిషేధాన్ని భారత్​ ఎత్తివేసింది. ప్రాణాంతక కరోనా వైరస్​తో పోరాడుతున్న చైనాకు బాసటగా నిలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనాలోని భారత రాయబారి విక్రమ్​ మిశ్రీ తెలిపారు.

కరోనా వైరస్​పై సానుభూతి తెలుపుతూ చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాసిన ఒక్కరోజు అనంతరం.. అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

జనవరి 31న నిషేధం...

ఇప్పటివరకు 900 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న కరోనా వైరస్​.. అత్యంత వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో గతనెల 31న చైనాకు అన్ని రకాల వ్యక్తిగత రక్షణ పరికరాలతో పాటు కొన్ని వైద్య పరికరాలపై కేంద్రం నిషేధం విధించింది. తాజాగా వాటిపై నిషేధాన్ని ఎత్తివేసింది.

ఇదీ చూడండి: కరోనా నుంచి ప్రాణాలతో బయటపడ్డ తొలి బాధితురాలు

Last Updated : Feb 29, 2020, 10:10 PM IST

ABOUT THE AUTHOR

...view details