తెలంగాణ

telangana

ETV Bharat / international

కాల్పులతో హాంకాంగ్​ నిరసనలు మరింత ఉద్ధృతం - నిరసనలు

హాంకాంగ్​లో పోలీసులు 17 సంవత్సరాల విద్యార్థిపై తూటాను ప్రయోగించగా  నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నగరమంతా భారీ ప్రదర్శనలు నిర్వహించారు.

హాంకాంగ్​

By

Published : Oct 2, 2019, 10:51 PM IST

హాంకాంగ్​
హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనకారులు మంగళవారం చేపట్టిన నిరసన.. పోలీసుల కాల్పులతో హింసాత్మకంగా మారింది. నిరసనకారులంతా పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఇదీ జరిగింది...

చైనా అంతటా 70వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ హాంకాంగ్‌ వ్యాప్తంగా ఆందోళనలు హోరెత్తాయి. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి నిరసనలో పాల్గొన్నారు. పలు చోట్ల రాళ్లు విసురుతూ, పెట్రోల్​ బాంబు దాడి చేస్తూ ఆందోళనకారులు చెలరేగిపోయారు. వారిపై పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. ఈ ఘర్షణలో ఓ నిరసనకారుడిపై కాల్పులు జరపడంతో నిరసనలు మరింత ఉద్ధృతంగా మారాయి.

దాదాపు 4 నెలల నుంచి కొనసాగుతున్న ఈ ఆందోళనల్లో నిరసనకారులపై తూటా ప్రయోగించడం ఇదే మొదటిసారి. పోలీస్‌ అధికారి కాల్పులు జరపినందున నిరసనకారుడి ఛాతిలోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. బాధితునికి ప్రాథమిక చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు. ఈ అల్లర్లలో 25 మంది పోలీసులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. 160 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

నిరసనకారుల డిమాండ్​

పోలీసుల ఆగడాలపై స్వతంత్ర విచారణ జరపాలని, అరెస్టు చేసిన వారిని విడిచిపెట్టాలని నిరసనకారులు డిమాండ్​ చేశారు. కానీ బీజింగ్​ అధికారులు​ వారి డిమాండ్​లను నెరవేర్చేందుకు ససేమీరా అంటున్నారు.

ఇదీ చూడండి : సబ్​వేలో ఎమిలీ పాట... వింటే ఎవరైనా ఫిదా

ABOUT THE AUTHOR

...view details