నేరస్థుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా హాంకాంగ్‌లో 11 వారాలుగా సాగుతున్న నిరసనలు మరోమారు హింసాత్మకంగా మారాయి. శనివారం ఆందోళనకారులు రోడ్లమీదకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శన చేపట్టారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
లైవ్ ఫైట్: హాంకాంగ్ పోలీసులు X నిరసనకారులు - ఘర్షణ
హాంకాంగ్‌లో శనివారం నిరసనలు తారస్థాయికి చేరుకున్నాయి. ఆందోళనకారులు, పోలీసులు తీవ్రస్థాయిలో ఘర్షణ పడ్డారు. ఈ గొడవల్లో పలువురు గాయపడ్డారు.

లైవ్ ఫైట్: హాంకాంగ్ పోలీసులు X నిరసనకారులు
లైవ్ ఫైట్: హాంకాంగ్ పోలీసులు X నిరసనకారులు
ఓ దశలో పోలీసులు, నిరసనకారులు పరస్పరం దాడులు చేసుకున్నారు. రాళ్లు, కర్రలు విసురుకున్నారు. కాసేపు ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. ఈ గొడవల్లో కొంతమంది పోలీసులకు, నిరసనకారులకు గాయాలయ్యాయి.
ఇదీ చూడండి:నిరసనలతో హాంగ్‌కాంగ్ విలవిల
Last Updated : Sep 28, 2019, 3:09 AM IST