చైనా క్వాంజై నగరంలో కరోనా నిర్బంధ కేంద్ర భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20మంది మరణించినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. 52 గంటల తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న తల్లీకొడుకులను సురక్షితంగా బయటకు తీసినట్లు పేర్కొన్నారు. అలాగే సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని వివరించారు.
52 గంటలపాటు శిథిలాల కిందే తల్లీకొడుకు.. సురక్షితం
చైనా క్వాంజై నగరంలో హోటల్ భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. 52 గంటల తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న తల్లీకొడుకులను రక్షించినట్లు అధికారులు వెల్లడించారు.
'కరోనా హోటల్' కూలిన ఘటనలో 20కి చేరిన మృతులు
80 గదులు ఉన్న హోటల్‌ను చైనా ప్రభుత్వం కరోనా నిర్బంధ కేంద్రంగా ఉపయోగిస్తోంది. వైరస్ సోకిందన్న అనుమానం ఉన్న వారిని అక్కడే ఉంచి చికిత్స అందిస్తోంది. ఈ క్రమంలో దురదృష్టవశాత్తు శనివారం రాత్రి ప్రమాదం జరిగింది. ఘటనా సమయంలో హోటల్లో 71 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి:మోదీ, అమిత్‌షాతో సింధియా సమావేశం
Last Updated : Mar 10, 2020, 3:19 PM IST