తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా ఎఫెక్ట్‌: చైనాలో కరెన్సీ నోట్ల నిల్వ! - CHINA CURRENCY

కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్​ ప్రభావిత ప్రాంతాల్లో నోట్లను తాత్కాలికంగా నిల్వ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

china-cleans-locks-away-banknotes-to-stop-virus-spread
కొవిడ్‌ ఎఫెక్ట్‌: చైనాలో కరెన్సీ నోట్ల నిల్వ!

By

Published : Feb 16, 2020, 5:08 AM IST

Updated : Mar 1, 2020, 12:01 PM IST

కరోనా వైరస్​ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు.. కరెన్సీ నోట్లపైన దృష్టి సారించింది చైనా. నోట్ల ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉండటం వల్ల ప్రభావిత ప్రాంతాల్లో వాటిని తాత్కాలికంగా నిల్వ చేయడం ప్రారంభించినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు.

ఇప్పటికే హుబెయ్‌ ప్రావిన్స్‌కు 4 బిలియన్‌ యువాన్ల కొత్త నోట్లను సరఫరా చేసినట్లు చైనా పీపుల్స్‌ బ్యాంక్‌ వైస్‌ గవర్నర్‌ ఫ్యాన్‌ యెఫై తెలిపారు. నోట్ల ద్వారా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు నోట్లను ప్రభుత్వ బ్యాంకుల్లో తాత్కాలికంగా నిల్వ చేయమని సెంట్రల్‌ బ్యాంకు సూచించినట్లు చెప్పారు. ఆసుపత్రులు, తడి మార్కెట్ల నుంచి వచ్చే నోట్లను భద్రపరచి.. వాటిని యూవీ కిరణాల ద్వారా శుభ్రపరిచిన తర్వాతే పునర్వినియోగానికి పంపాలని చెప్పామన్నారు. ఇప్పటికే వైరస్‌ ప్రభావం బాగా ఉన్న ప్రాంతాల్లో బ్యాంకుల నుంచి నగదు సరఫరాను నిలిపివేసినట్లు చెప్పారు. నగదు బదులు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సర్వీసెస్‌ ఉపయోగించుకునేలా సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రోత్సహిస్తోందని చెప్పారు.

534 బిలియన్ల యువాన్లు కేటాయింపు..

వ్యాధిపై పోరాడేందుకు రాష్ట్ర సంస్థలకు, ప్రభుత్వ బ్యాంకులకు 534బిలియన్ల యువాన్లు కేటాయించినట్లు చైనా బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌ నియంత్రణ సంస్థ వైస్‌ ఛైర్మన్‌ లియాంగ్‌ టావో తెలిపారు. అదేవిధంగా బ్యాంకులు రుణాల నగదు వసూళ్లను వాయిదా వేసుకోవాలని సూచించినట్లు తెలిపారు.

వాటికి శుభ్రం చేసుకోవాలి...

కొవిడ్‌ వైరస్‌ దరిచేరకుండా ముఖానికి మాస్కులు, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం తప్పనిసరంటూ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే చైనాలో దీని బారిన పడి మరణించిన వారి సంఖ్య 1523కు చేరింది. కొవిడ్ సోకిన వారి సంఖ్య 66వేలకు చేరినట్లు చైనా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:పాఠశాల బస్సులో మంటలు.. నలుగురు చిన్నారులు సజీవ దహనం

Last Updated : Mar 1, 2020, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details