తెలంగాణ

telangana

ETV Bharat / international

'కరోనా సోకేందుకు వయసుతో సంబంధం లేదు!' - mortality rate is high in old age for corona

కరోనా సోకడానికి వయసుకు ఏ సంబంధం లేదని ఓ సర్వే స్పష్టం చేసింది. మానవునిలో వైరస్​ తీవ్రత, లక్షణాలు, మరణించే అవకాశాలను పరిగణనలోకి తీసుకొని అధ్యయనం చేసినట్లు పేర్కొంది. వయసుపైపడిన వారిలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు చెప్తున్నారు.

Age may not contribute to COVID-19 infection risk: Study
'కరోనా బారిన పడడానికి వయసుతో సంబంధం లేదు'

By

Published : Oct 13, 2020, 2:05 PM IST

కరోనా వైరస్ బారిన పడడానికి వయసుకు ఏమాత్రం సంబంధం లేదని అన్నారు జపాన్‌కు చెందిన హొకైడో విశ్వవిద్యాలయం పరిశోధకులు. ఇటలీ, జపాన్‌, స్పెయిన్‌లోని కొవిడ్‌ రోగులపై చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు తెలిపారు. అయితే వయసును బట్టి వ్యాధి తీవ్రత పెరుగుతోందని పేర్కొంది. ఈ మేరకు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ఓ కథనాన్ని ప్రచురించారు.

ఎక్కువ వయసు ఉన్న వారిలో కొవిడ్​ తాలూకు లక్షణాలు అధికంగా బయటపడుతున్నట్లు వెల్లడైంది. మరణాలు రేటు కూడా అదే స్థాయిలో ఉన్నట్లు తేలింది. ఈ ఏడాది మే వరకు ఇటలీలో ప్రతీ లక్ష మందిలో 382 మంది వైరస్​ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. స్పెయిన్​లో 507.2, జపాన్​లో 13.2 గా ఉంది.

ఇదీ చూడండి: ముందంజలో ఆక్స్​ఫర్డ్​ టీకా 'కొవిషీల్డ్'​: డీసీజీఐ

ABOUT THE AUTHOR

...view details