అగ్రరాజ్య అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్‌కు పలు దేశాధినేతలు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం ప్రసంగించిన బైడెన్.. ప్రపంచదేశాలతో తిరిగి సంబంధాలు పునరుద్ధరిస్తామని తెలిపారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి, భద్రత కోసం బలమైన, నమ్మకమైన భాగస్వామి కోసం అమెరికా ఎదురుచూస్తోంది అన్నారు. గతంలో జరిగిన వాటి గురించి తాము ఆలోచించడం లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రపంచ దేశాధినేతలు అగ్రరాజ్యంతో మైత్రీ సంబంధాలను నెలకొల్పేందుకు ఆరాటపడుతున్నారు. ఈ మేరకు ట్వీట్లు చేశారు.
ఎవరేమన్నారు?
"అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు అభినందనలు. నాలుగేళ్ల తరువాత మీతో మైత్రీ సంబంధం కొనసాగించడానికి ఐరోపా సిద్ధంగా ఉంది."
-ఉర్సులా వాన్‌డెర్ లియోన్ , ఐరోపా సమాఖ్య కమిషన్ అధ్యక్షురాలు
"బైడెన్, కమలకు శుభాకాంక్షలు. అమెరికా, ఐరోపా మధ్య సంబంధాలను పునరుద్ధరించేందుకు ఇది సరైన సంమయం అని అనుకుంటున్నాం."
-చార్లెస్ మైకేల్, ఐరోపా సమాఖ్య అధ్యక్షుడు
"అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం.. అగ్రరాజ్యానికి-అట్లాంటిక్ కూటమి మధ్య సరికొత్త అధ్యాయాన్ని సూచిస్తోంది. చైనా ఆధిపత్య ధోరణికి, అఫ్గానిస్థాన్, ఇరాక్ లాంటి ఉగ్రవాద దేశాలతో ఉన్న భద్రతాపరమైన సమస్యల పరిష్కారానికి 'నాటో' సభ్యదేశాలు కలిసి ఏకతాటిపైకి రావాల్సిందిగా కోరుతున్నా."
-నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్
"బైడెన్.. మీకు అభినందనలు. ప్రపంచ మానవాళి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దూరదృష్టితో మీ ఆలోచనలు వాటికి మార్గనిర్దేశం చేస్తాయని ఆశిస్తున్నాను."
-పోప్ ఫ్రాన్సిస్
"అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బైడెన్‌కు హృదయపూర్వక అభినందనలు. భారత్- అమెరికా వ్యూహాత్మక భాగస్వామాన్ని బలోపేతం చేసేందుకు.. బైడెన్‌తో కలిసి పనిచేసేందుకు నేను ఎదురుచూస్తున్నా."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
"అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన బైడెన్.. మీకు శుభాకాంక్షలు. మీ రాకతో అమెరికా, జర్మనీ మధ్య మైత్రీ సంబంధాలు మరింత మెరుగుపడుతాయి అని భావిస్తున్నాం."
-జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్
"పర్యావరణహితం అనేది అందరికీ సంబంధించింది. ప్యారిస్ పర్యాపరణ ఒప్పందంపై ఇరు దేశాలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై మనం కలిసి పోరాడదాం. భూమిని రక్షించుకుందాం."