అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరును.. ఎలాంటి వాణిజ్య కార్యకలాపాల్లోనూ ఉపయోగించరాదని ఆమె అధికార ప్రతినిధి సబారినా సింగ్ తెలిపారు. శ్వేతసౌధం.. హారిస్, ఆమె కుటుంబ సభ్యులు అత్యున్నత నైతిక ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని ఆమె అన్నారు. ఇలాంటి సందర్భంలో వారి పేర్లను వినియోగిస్తే.. దాన్ని దుర్వినియోగం చేసినట్లవుతుందని పేర్కొన్నారు.
ఇటీవల కమల బంధువు మీనా హారిస్.. తన ప్రతిష్ఠను పెంచుకునేందుకు తన కంపెనీ వస్త్రాలపై 'వైస్ ప్రెసిడెంట్ ఆంటీ' అని ముద్రించుకున్నారు. దీనిని శ్వేతసౌధం వ్యతిరేకించినట్టు.. కమల పేరును ఉపయోగించవద్దని స్పష్టం చేసినట్టు రిపోర్టులు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
"ఉపాధ్యక్షురాలు, ఆమె కుటుంబం శ్వేతసౌధం పరంగా అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉంటారు. ఈ క్రమంలో సొంత బ్రాండ్‌ను పెంచుకునేందుకు వారి పేర్లను, మద్దతును ఎలాంటి వాణిజ్య కార్యకలాపాల్లో ఉపయోగించకూడదు."
- సబారినా సింగ్, కమలా హారిస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ