అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో గల తన ప్రైవేట్ క్లబ్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. తొలుత కుటుంబంతో కలిసి బీచ్‌లోని బాప్టిస్ట్ చర్చికి వెళ్లారు. ఈ సందర్భంగా ట్రంప్ దంపతులు ప్రత్యేక పార్థనలు చేశారు. ట్రంప్ అతని భార్య మెలానియాను 2005లో ఇదే చర్చిలో వివాహం చేసుకున్నారు ట్రంప్.
కుటుంబంతో కలిసి ట్రంప్ క్రిస్మస్ సంబరాలు - trump latest news
అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిస్మస్ను ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు ట్రంప్. తొలుత ట్రంప్ దంపతులు అమెరికన్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు.

కుటుంబంతో కలిసి ట్రంప్ క్రిస్మస్ సంబరాలు
'కుటుంబాలకు దూరంగా ఉండే దేశ సైనికుల కోసం, ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేశా. దేశాల మధ్య శాంతి ఉంటే ప్రపంచం ఆనందంగా ఉంటుంది.' అని ఈ సందర్భంగా క్రిస్మస్ సందేశమిచ్చారు ట్రంప్. 'అధ్యక్షుడి తరఫున, నా తరఫున ప్రతి ఒక్క అమెరికా పౌరుడికి క్రిస్మస్ శుభాకాంక్షలు.' అన్నారు అమెరికా ప్రథమ పౌరురాలు మెలానియా. ఈ మేరకు సంయుక్తంగా ఒక వీడియో విడుదల చేశారు ట్రంప్ దంపతులు.
Last Updated : Dec 26, 2019, 7:41 AM IST