తెలంగాణ

telangana

ETV Bharat / international

బైడెన్ ప్రమాణ స్వీకారానికి నేను రాను: ట్రంప్​

జనవరి 20న జో బైడెన్​ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి తాను హాజరుకానని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ చెప్పారు. ఆండ్రూ జాన్సన్​ తర్వాత ఈ కార్యక్రమానికి గైర్హాజరు అవుతున్న అధ్యక్షుడు ట్రంపే కావడం గమనార్హం.

Trump says he will not attend President-elect Biden's inauguration on Jan 20
బైడెన్ ప్రమాణ స్వీకారానికి నేను రాను: ట్రంప్​

By

Published : Jan 8, 2021, 10:17 PM IST

Updated : Jan 8, 2021, 11:14 PM IST

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్​ ఈనెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తాను హాజరుకావడం లేదని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు. అండ్రూ జాన్సన్​ తర్వాత నూతన అధ్యక్షుని ప్రమాణ స్వీకారానికి గైర్హాజరవుతున్న అగ్రరాజ్యం అధ్యక్షునిగా ట్రంప్ నిలవనున్నారు ​.

"నన్ను అడిగిన అందరికీ చెబుతున్నా, జనవరి 20న జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవానికి నేను హాజరుకాను."

-ట్రంప్​ ట్వీట్​

అధ్యక్షపదవి నుంచి తప్పుకునే ముందు చివరి గంటలు ఎలా గడుపుతారనే విషయంపై ఇప్పటివరకూ ట్రంప్​ ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. ఆయన ప్రణాళికలు ఎలా ఉన్నా జనవరి 20 మధ్యాహ్నం అగ్రరాజ్యం 46వ అధ్యక్షునిగా జో బైడెన్​ బాధ్యతలు చేపట్టనున్నారు.

తన పదవీ కాలం త్వరలోనే ముగుస్తుందని గురువారం వీడియో సందేశం ద్వారా తెలిపారు ట్రంప్​. నూతన అధ్యక్షునిగా ఎన్నికైన బైడెన్​ పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు.

ఇదీ చూడండి: తప్పుకునే ముందు ట్రంప్ 'స్వీయ క్షమాభిక్ష'!

Last Updated : Jan 8, 2021, 11:14 PM IST

ABOUT THE AUTHOR

...view details