అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో 29 మందికి క్షమాభిక్ష పెట్టారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ట్రంప్. వీరిలో ఎన్నికల ప్రచార కమిటీ మాజీ ఛైర్మన్ పాల్ మనఫోర్ట్, అతని మేనల్లుడి తండ్రి చార్లెస్ కుష్ణార్ ఉన్నారు. దీంతో గడిచిన రెండు రోజులుగా ట్రంప్ క్షమాభిక్ష పెట్టినవారి మొత్తం సంఖ్య 49కు చేరింది.
మరో 29 మందికి ట్రంప్ క్షమాభిక్ష - Trump pardons latest news
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరో 29 మందికి క్షమాభిక్ష పెట్టారు. వారిలో ఎన్నికల ప్రచార మాజీ ఛైర్మన్ పాల్ మనఫోర్ట్, అతని మేనల్లుడి తండ్రి చార్లెస్ కుష్ణార్ సైతం ఉన్నారు.

మరో 29 మందికి ట్రంప్ క్షమాభిక్ష
తాజా 29 మందిలో వివిధ కేసుల్లో దోషులుగా తేలినవారితో పాటు 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రష్యా జోక్యంపై 'రాబర్ట్ మ్యూలర్' చేపట్టిన దర్యాప్తులో నేరస్థులుగా తేలినవారు ఉన్నారు. ఇరాక్ విధ్వంసకాండలో దోషులైన కాంట్రాక్టర్లూ ఉన్నారు.
ఇదీ చూడండి:ఆ 15 మందికి ట్రంప్ క్షమాభిక్ష