కరోనాతో అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో మే 24న జరగాల్సిన నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీ రద్దు అయ్యింది. 1925లో ప్రారంభమైన ఈ పోటీ రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1943 నుంచి 1945 వరకు తొలి సారిగా రద్దు అయ్యింది. ఆ తర్వాత మరోసారి రద్దు కావడం ఇదే మొదటి సారి. ఆంగ్ల భాషలోని స్పెల్లింగ్‌లపై నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమం అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది.
కరోనాతో మరో ప్రతిష్టాత్మక పోటీ రద్దు - america
కరోనా ధాటికి అంతర్జాతీయ క్రీడలు, పలు పెద్ద కార్యక్రమాల వాయిదాలు, రద్దుల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో ప్రతిష్టాత్మక పోటీ కార్యక్రమం ఆ జాబితాలో చేరింది.

కరోనాతో మరో ప్రతిష్టాత్మక పోటీ రద్దు
ప్రపంచవ్యాప్తంగా ఏటా వందలాది మంది పాఠశాల విద్యార్థులు ఈ పోటీలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ఈఎస్పీఎన్ ప్రసారం చేస్తోంది. కరోనా కారణంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో జాతీయ స్పెల్లింగ్ బీ పోటీలను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.