అనార్మ్డ్ ప్రొటోటైప్ హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ తెలిపింది. ధ్వని కన్నా 5 రెట్ల వేగంతో దూసుకెళ్లే ఈ క్షిపణి.. దుర్భేద్యమైన రక్షణ వ్యవస్థలను కూడా ఛేదిస్తుందని పెంటగాన్ ప్రకటించింది.
2017 అక్టోబర్‌లో అమెరికా సైనిక విభాగం, నౌకా విభాగం ఉమ్మడిగా చేసిన ప్రయోగాంలో కొన్ని సమస్యలు తలెత్తాయని.. తాజా పరీక్షల్లో హైపర్సోనిక్ వేగంతో లక్ష్యం దిశగా పయనించిందని పెంటగాన్ తెలిపింది.
బాలిస్టిక్, క్రూయిజ్‌ల కంటే..
అణు బాంబులను కూడా మోసుకెళ్లే సామర్థ్యం ఈ హైపర్సోనిక్ క్షిపణులకు ఉంటుంది. ప్రస్తుతం అణుబాంబులను మోసుకెళ్లేందుకు ఉపయోగిస్తున్న బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణుల కన్నా ఎక్కువ ఎత్తులో, వేగంగా ఈ హైపర్సోనిక్ మిస్సైళ్లు ప్రయాణిస్తాయి. ఫలితంగా శత్రు రక్షణ వ్యవస్థలను ఈ క్షిపణి సులభంగా ఓడిస్తుంది.