తెలంగాణ

telangana

ETV Bharat / international

Space tour: బెజోస్-రిచర్డ్​ యాత్రల మధ్య తేడాలివే..

ప్రపంచ కుబేరుడు, అమెజాన్ అధినేత జెఫ్​ బెజోస్ మంగళవారం అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. అయితే.. బ్రిటన్​కు చెందిన మరో కుబేరుడు రిచర్డ్ బ్రాన్సన్​ ఇప్పటికే అంతరిక్షయాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో.. రిచర్డ్-బెజోస్ యాత్రల మధ్య తేడాలేంటో ఒకసారి తెలుసుకోండి.

bezos, space tour
బెఫ్ బెజోస్, స్పేస్ టూర్

By

Published : Jul 19, 2021, 7:50 PM IST

రిచర్డ్​ బ్రాన్సన్​.. జెఫ్​ బెజోస్​.. ఈ కుబేరుల మధ్య నెలకొన్న పోటీతో ప్రైవేటు అంతరిక్ష యాత్రలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తన సంస్థ బ్లూ ఆరిజిన్ రూపొందించిన స్పేస్ షిప్​లో జులై 20న సోదరునితో కలిసి అంతరిక్ష యాత్రకు బయలుదేరుతున్నట్లు ప్రకటించి బెజోస్​ వార్తల్లో నిలిచారు. బెజోస్​కు తిరుగులేదనుకున్న సమయంలో.. బ్రిటన్​ కుబేరుడు రిచర్డ్​ బ్రాన్సన్​ ఆయనకు షాక్​ ఇచ్చారు. బెజోస్​ కన్నా 9 రోజుల ముందే.. అంటే జులై 11న రోదసి యాత్రను విజయవంతంగా ముగించేసి సంచలనం సృష్టించారు. ఇక ఇప్పుడు బెజోస్​ వంతు! ఈ నేపథ్యంలో.. రిచర్డ్​- బెజోస్​ యాత్రల మధ్య తేడాలేంటో ఇప్పుడు చూద్దాం..

రిచర్డ్ బ్రాన్సన్- జెఫ్ బెజోస్ అంతరిక్షయాత్రల విశేషాలు

బెజోస్​ తిరుగుప్రయాణం ఎలా?

న్యూ షెపర్డ్ వ్యోమనౌక భూమిపై నుంచి నిర్దేశిత ఎత్తుకు చేరుకున్నాక బెజోస్ బృందం ప్రయాణించే క్యాప్యుల్ రాకెట్​తో విడిపోతుంది. అనంతరం వారు భారరహిత స్థితి అనుభూతిని పొందుతారు. క్యాప్సుల్​లో సబ్​ ఆర్బిటల్​కు చేరిన బెజోస్​ బృందం.. భూమిని, విశ్వాన్ని క్యాబిన్​ నుంచి వీక్షిస్తారు. తర్వాత క్యాప్సుల్ తిరిగి భూమికి చేరుతుంది. పెద్ద ప్యారచూట్ల సాయంతో యాత్రికులు కిందకి దిగుతారు.

పక్కా స్కెచ్​..

2012 నుంచి న్యూషెపర్డ్​ వ్యోమనౌకను 15సార్లు విజయవంతంగా ప్రయోగించినట్లు బ్లూ ఆరిజన్​ స్పష్టం చేసింది. అయితే.. మానవసహిత ప్రయోగం మాత్రం ఇదే తొలిసారి. ఈ వ్యోమనౌకలో బెఫ్​ బెజోస్​తో పాటు ఆయన సోదరుడు మార్క్​ బెజోస్​ కూడా ప్రయాణించనున్నారు.

అయితే.. రోదసిలోకి వెళ్తున్న సమయంలో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే... న్యూషెపర్డ్​ వ్యోమనౌక, క్యాప్సుల్​ నుంచి విడిపోయే విధంగా రాకెట్​ను అభివృద్ధి చేసినట్లు బ్లూ ఆరిజిన్ సిబ్బంది పేర్కొన్నారు. ఈ 'ఎస్కేప్ సిస్టమ్​'ను కూడా మూడు సార్లు ప్రయోగించినట్లు స్పష్టం చేశారు. క్యాప్సుల్​లో పైలట్లు ఉండరని, అది పూర్తిగా ఆటోమేటెడ్ అని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details