తెలంగాణ

telangana

By

Published : Dec 29, 2019, 6:22 PM IST

ETV Bharat / international

ఇవాంకా ట్రంప్​ శ్వేతసౌధాన్ని వీడతారా..?

రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​ మరోసారి విజయం సాధిస్తే... ఇవాంకా శ్వేతసౌధంలో కొనసాగుతారా? ఈ సందేహం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ట్రంప్​ పాలనలో కీలకపాత్ర పోషిస్తోన్న ఇవాంకా... తన కుటుంబానికే తొలి ప్రాధాన్యం అని ఓ ప్రసార కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.

Ivanka will leave the White House.?
ఇవాంకా శ్వేతసౌధాన్ని వీడతారా..?

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి ఎన్నికైతే ఆయన కుమార్తె ఇవాంకా శ్వేతసౌధంలో కొనసాగుతారా.. లేదా.. అన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆమె ట్రంప్‌ పాలకవర్గంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. సీబీఎస్‌ ఛానెల్‌లో ప్రసారం అయ్యే ‘ఫేస్‌ ది నేషన్‌’ కార్యక్రమంలో తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలే ఈ సందేహాలకు తెరతీశాయి. తిరిగి ట్రంప్‌ పాలకవర్గానికి సేవలందించనున్నారా అన్న ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ...‘‘నా పిల్లలు, వారి సంతోషమే నా తొలి ప్రాధాన్యం. వారి అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగానే నా నిర్ణయాలు ఉంటాయి’’ అని సమాధానం ఇచ్చారు.

తన పదవీ కాలంలో అనేక వర్గాలకు సేవ చేసేందుకు కృషి చేశానని ఇవాంకా తెలిపారు. గత రెండున్నరేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా పర్యటించాను.. ఇంకా చేయాల్సింది చాలా ఉందని అభిప్రాయపడ్డారు. ‘భవిష్యత్తులో అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఉందా’ అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ..‘‘నిజాయితీగా చెప్పాలంటే నాకు రాజకీయాలపై అంతగా ఆసక్తి లేదు’’ అని అన్నారు.

ట్రంప్‌ భార్య మెలనియాతో ఇవాంకాకు సత్సంబంధాలు లేవన్న ప్రచారం ఉన్న విషయం తెలిసిందే. అధ్యక్ష భవనంలో తన పాత్ర విషయంలో ఇవాంకతో మెలనియా చాలాసార్లు విభేదించినట్లు ఇటీవల సీఎన్‌ఎన్‌ పాత్రికేయురాలు కేట్‌ బెనెట్‌ రాసిన పుస్తకంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇవాంకా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఇదీ చూడండి: మైక్​ టైసన్​, మహ్మద్​ అలీకి శిక్షణ ఇచ్చిన జిమ్ ఇదే...

ABOUT THE AUTHOR

...view details