అమెరికా సియాటెల్‌లో 2021లో భారత 75వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రవాస భారతీయులు భావించారు. 20 వేల మందితో నిర్వహించే కార్యక్రమానికి వాషింగ్టన్ గవర్నర్ జే రాబర్ట్ ఇన్స్లేను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని నిర్ణయించారు.
ప్రవాస భారతీయుల ప్రతినిధి టి.జి.విశ్వప్రసాద్ నిర్వహించిన వర్చువల్ ఫండ్ రైజర్ కార్యక్రమంలో వాషింగ్టన్ గవర్నర్ జే రాబర్ట్ ఇన్స్లే పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై మాట్లాడిన ఇన్స్లే.. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం వ్యర్థమని పేర్కొన్నారు. తమ పరిధిలో ఉన్న సమాజానికి సేవలందించటంపై దృష్టి సారించాలని వ్యాఖ్యానించారు. ప్రతి దేశానికి సొంత సమస్యలు ఉంటాయని, వాటిపై అంతర్గతంగా దృష్టి సారించాలని సూచించారు.