ప్రవాస భారతీయులు విదేశాల నుంచి పంపే సొమ్ము(highest recipient of remittances) గణనీయంగా పెరిగింది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం.. విదేశాల్లోని ప్రవాసుల నుంచి అత్యధిక సొమ్ము అందుకుంటున్న దేశంగా మరోమారు భారత్ తొలి స్థానంలో(largest recipient of remittances in 2021) నిలిచింది. 2020లో ప్రవాసుల నుంచి 83 బిలియన్ డాలర్లు అందుకోగా.. ఈ ఏడాది 4.6శాతం వృద్ధితో 87బిలియన్ డాలర్లు వచ్చాయి. ఈ మొత్తంలో అధికశాతం అమెరికా నుంచే రావడం విశేషం. చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ప్రవాసులు పంపే సొమ్ములో అగ్రస్థానం నిలబెట్టుకున్న భారత్
విదేశాల నుంచి ప్రవాసుల సొమ్మును(highest recipient of remittances) అందుకుంటున్న దేశాల్లో తొలిస్థానాన్ని నిలబెట్టుకుంది భారత్. 2020లో.. విదేశాల్లోని ప్రవాసుల నుంచి భారత్ 87 బిలియన్ డాలర్లను(largest recipient of remittances in 2021) అందుకుందని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. 2021తో పోలిస్తే 4.6శాతం అధికంగా అందుకున్నట్లు స్పష్టం చేసింది.
వనరులు
ప్రపంచ బ్యాంకు నివేదిక..
- ప్రవాసులు పంపే సొమ్ము 2022లో మూడు శాతం వృద్ధి చెంది 89.6 బిలియన్ల డాలర్లకు చేరుకుంటాయని అంచనా. కానీ.. కరోనా కారణంగా అరబ్ దేశాల నుంచి భారత్కు(largest receiver of remittances) తిరిగొచ్చిన వారి శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఆదాయం తగ్గనుంది.
- ఈ చెల్లింపుల్లో కరోనా రెండో దశలో దేశానికి వెల్లువెత్తిన విరాళాలు (ఆక్సిజన్ ట్యాంకుల కొనుగోలు) కూడా ఉన్నాయి.
- రెండో త్రైమాసికంలోనే 87 బిలియన్లు ప్రవాసీయుల సొమ్ము భారత్ చేరుతుందని అంచనా వేసినప్పటికీ.. కరోనా తీవ్రత అధికంగా ఉన్న కారణంగా అది సాధ్యపడలేదు.
- 2021లో తక్కువ, మధ్యాదాయ దేశాల పౌరుల సొమ్ము 7.3 శాతం వృద్ధితో 589 బిలియన్లకు చేరుకుంటాయని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.
- 2020 నాటి దూకుడుకు కొనసాగింది. అయితే.. కరోనా వల్ల తెలెత్తిన ప్రపంచ మాంద్యం కారణంగా ప్రవాసీయుల చెల్లింపులు 1.7 శాతం క్షీణించాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు గాడిన పడిన విషయాన్ని ఈ అంశం చేస్తోంది.
ఇవీ చదవండి: