గడిచిన ఏడాదిలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని ప్రపంచ వాతావరణ సంఘాలు నివేదించాయి. 2016లో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలను గతేడాది ఉష్ణోగ్రతలు అధిగమించడమో లేదా సమం చేయడమో జరిగిందని నాసా సహా పలు సంస్థలు వెల్లడించాయి.
నేషనల్ ఓషియానిక్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్(ఎన్ఓఏఏ) సహా మరిన్ని ఏజెన్సీలు మాత్రం 2016నాటి గరిష్ఠ ఉష్ణోగ్రతలకు గతేడాది ఉష్ణోగ్రతలు సమీపించినట్లు తెలిపాయి. గతేడాది సగటున 58.77 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందన్న ఎన్ఓఏఏ.. ఇది 2016నాటి ఉష్ణోగ్రతల కంటే కాస్త తక్కువని తెలిపింది.