తెలంగాణ

telangana

ETV Bharat / international

Covid impact on Education: 'కరోనా వేళ పాఠశాలల మూసివేతను సమర్థించలేం'

Covid impact on Education: కరోనా నేపథ్యంలో పాఠశాలల మూసివేతను సమర్థించలేమన్నారు ప్రపంచ బ్యాంకు విద్యా విభాగం డైరెక్టర్‌ జేమీ సావ్‌ద్రా. కొత్త వేరియంట్లు వచ్చినప్పటికీ పాఠశాలలను మూసివేయడం చివరి మార్గంగానే ఉండాలని అభిప్రాయపడ్డారు.

Covid impact on Education
Covid impact on Education

By

Published : Jan 16, 2022, 6:05 PM IST

Covid impact on Education: కరోనా సహా వాటి కొత్త వేరియంట్‌ల పుట్టుక వల్ల పాఠశాలలను మూసివేయడాన్ని ప్రస్తుతానికి సమర్థించుకోలేమని ప్రపంచ బ్యాంకు విద్యా విభాగం డైరెక్టర్‌ జేమీ సావ్‌ద్రా అన్నారు. ప్రపంచ విద్యారంగంపై కరోనా ప్రభావం పట్ల అధ్యయనం చేస్తున్న ఆయన.. కొత్త కొవిడ్ వేరియంట్లు వస్తే పాఠశాల మూసివేతను చివరి మార్గంగా అనుసరించాలని సూచించారు.

పాఠశాలలు సురక్షితంగా లేకపోవడం సహా తిరిగి తెరిస్తే కరోనా కేసులు పెరుగుతాయన్న విషయంపై ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. పాఠశాలలను తెరవడానికి, కరోనా వ్యాప్తికి ఎలాంటి సంబంధం లేదని జేమీ సావ్‌ద్రా వివరించారు.

బార్లు, రెస్టారెంట్‌లు, షాపింగ్‌ మాళ్లను తెరిచి, పాఠశాలలను మూసివేయడంలో అర్థం లేదన్నారు. దీన్ని క్షమించలేమని పేర్కొన్నారు. పాఠశాలలను తెరిచినా పిల్లల ఆరోగ్యానికి ప్రమాదం తక్కువే అని తమ అధ్యయనాల్లో తేలిందని వివరించారు. పాఠశాలల మూసివేత వల్ల భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వెల్లడించారు. పిల్లలకు టీకాలు వేసిన తర్వాతే పాఠశాలలను తిరిగి తెరవాలనే నిబంధనను ఏ దేశంలోనూ లేదని.. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాల్లేవని పేర్కొన్నారు.

2020కు సంబంధించి "బీటెన్ లేదా బ్రోకెన్? ఇన్​ఫార్మాలిటీ, దక్షిణాసియాలో కరోనా" పేరుతో ప్రపంచ బ్యాంకు విద్యా విభాగం​ ఓ నివేదికను రూపొందించింది. దేశంలో కరోనా కారణంగా పాఠశాలలను దీర్ఘకాలికంగా మూసివేయడం వల్ల భవిష్యత్తులో 400 బిలియన్ డాలర్లకు మంచి నష్టం వాటిల్లుతుందని అంచనా వేసింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. అమెరికా, ఫ్రాన్స్​, ఇటలీ, జర్మనీ, స్పెయిన్​ సహా పలు దేశాల్లో కరోనా కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. ఫలితంగా వైరస్​ కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి ప్రపంచ దేశాలు.

ఇప్పటివరకు మొత్తం 32,70,17,695 మంది వైరస్​ బారిన పడగా.. 55,54,919 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details