జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర విజయవంతంగా పూర్తయింది. బెజోస్ సహా నలుగురు సభ్యుల బృందంతో కూడిన క్యాప్సుల్ సురక్షితంగా భూమికి చేరుకుంది.
జెఫ్ బెజోస్ రోదసి యాత్ర విజయవంతం! - జెఫ్ బెజోస్ స్పేస్ టూర్ విజయం

18:52 July 20
18:43 July 20
బెజోస్ అంతరిక్ష యాత్ర ప్రారంభమైంది. పశ్చిమ టెక్సాస్ ఎడారిలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న లాంచ్ సైట్ వన్ నుంచి బ్లూ ఆరిజిన్ షెపర్డ్ రోదసిలోకి దూసుకెళ్లింది.
18:15 July 20
రోదసిలోకి ప్రయాణించనున్న బృందం బ్లూ ఆరిజిన్ అంతరిక్ష నౌక ఎక్కి ప్రయాణానికి సిద్ధమయ్యారు.
17:48 July 20
బెజోస్ రోదసి యాత్ర లైవ్ అప్డేట్స్
ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ అంతరిక్షయాత్రకు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో.. బెజోస్, ఆయన సోదరుడు మార్క్ బెజోస్ సహా మరో ఇద్దరు రోదసిలోకి ప్రయాణించనున్నారు. బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థకు చెందిన అంతరిక్ష నౌక ద్వారా వీరు నింగిలోకి దూసుకెళ్లనున్నారు.
పశ్చిమ టెక్సాస్ ఎడారిలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న లాంచ్ సైట్ వన్ నుంచి మంగళవారం ఉదయం 8 గంటలకు(భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు) న్యూ షెపర్డ్ దూసుకెళ్లనుంది.
ఈ బృందం.. భూవాతావరణానికి, రోదసికి సరిహద్దు అయిన కర్మాన్ రేఖ ఆవల, భూమి నుంచి 100కిలోమీటర్ల ఎత్తులో 11 నిమిషాలు గడుపనుంది.