అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బృందంలో మరో భారతీయ అమెరికన్ కీలక స్థానానికి నామినేట్ అయ్యారు. అంతర్జాతీయ వాణిజ్య సమస్యలపై అపార అనుభవమున్న అరుణ్ వెంకటరమణను విదేశీ వాణిజ్య సేవల డైరెక్టర్ జనరల్‌గా బైడెన్ ఎంచుకున్నారు. గత 20ఏళ్లుగా ఎన్నో కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలు సహా.. అమెరికా ప్రభుత్వానికి వెంకటరమణ సలహాదారుగా ఉన్నారు.
అంతకుముందు.. వీసా విభాగంలో సీనియర్ డైరెక్టర్‌గానూ వెంకటరమణ పనిచేశారు. డిజిటల్ ఎకానమీ, వాణిజ్యం, పన్నుల విభాగం సహా.. పలు అంతర్జాతీయ సమస్యల పరిష్కారానికి వ్యూహాత్మక నాయకత్వం వహించారు.