తెలంగాణ

telangana

ETV Bharat / international

కుటుంబంపై ట్రక్కుతో దాడి- నలుగురు మృతి - టొరంటోలోని ఒంటారియో నగరంలో ముస్లింలపై దాడి

ఓ మతానికి చెందినవారన్న కారణంతో కెనడాలో ఓ కుటుంబంపైకి యువకుడు ట్రక్కుతో దూసుకెళ్లాడు. ఈ విద్వేషపూరిత ఘటనను కెనడా ప్రధాని ఖండించారు. ఇస్లామోఫోబియాకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

4 Muslim family members killed in 'targeted attack' in Canada's Ontario
ట్రక్కుతో కుటుంబంపై దాడి- నలుగురు మృతి

By

Published : Jun 8, 2021, 12:47 PM IST

కెనడా టొరంటోలోని ఒంటారియో నగరంలో విద్వేషపూరిత ఘటన జరిగింది. నిర్దిష్ట మతానికి చెందినవారనే కారణంతో కుటుంబంపైకి ట్రక్కుతో దూసుకెళ్లాడు ఓ యువకుడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో నలుగురు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

ఘటనా స్థలికి దగ్గర్లో ఉన్న ఓ పార్కింగ్ ప్రదేశం​లో నిందితుడు నాథానియెల్ వెల్ట్​మన్(20)ను అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ అఫ్జల్(46), మదీహా(44), యుమ్నా(15), మరో 74 ఏళ్ల మహిళ ఈ ఘటనలో మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు.

ప్రార్థనలు చేస్తున్న స్థానికులు

ఈ ఘటనను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. ఇస్లామోఫోబియాను ఎదుర్కొనేందుకు ప్రతి మార్గాన్ని ఉపయోగించుకుంటామని స్పష్టం చేశారు.

మృతులకు నివాళులు
ఘటనా స్థలిలో పుష్పగుచ్చాలతో స్థానికుల నివాళి

స్థానిక మేయర్ ఎడ్ హోల్డర్ సైతం ఈ ఘటనను తప్పుబట్టారు. "ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన సామూహిక హత్యాయత్నమిది. అత్యంత విద్వేషపూరితంగా జరిగిన ఘటన" అంటూ మండిపడ్డారు.

ఇదీ చదవండి:గాంధీ మునిమనవరాలికి ఏడేళ్ల జైలుశిక్ష

ABOUT THE AUTHOR

...view details