Ranbirkapoor Diamond gift to Aliabhatt: బాలీవుడ్ లవ్‌బర్డ్స్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఇంట్లో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముంబయిలోని రణ్‌బీర్ నివాసం 'వాస్తు'లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. రణ్‌బీర్ తనకు కాబోయే భార్యకు అత్యంత ఖరీదైన కానుక ఇచ్చారని తెలిసింది. ఈ ముద్దుగుమ్మ కోసం ప్రత్యేకంగా 8 వజ్రాలు పొదిగిన కాస్ట్లీ బ్యాండ్‌ను తయారు చేయించి ఇచ్చారట. లండన్ నుంచి దీన్ని తెప్పించారని తెలుస్తోంది. ఈ వజ్రాల బ్యాండ్‌ను ఆమె పెళ్లిలో ధరించనుంది.
ఆలియాకు రణ్‌బీర్ కాస్ట్లీ గిఫ్ట్.. దాని ప్రత్యేకత ఏంటంటే?
Ranbirkapoor Diamond gift to Aliabhatt: హీరో రణ్‌బీర్ కపూర్ తనకు కాబోయే భార్య హీరోయిన్ ఆలియా భట్‌కు ఖరీదైన కానుక ఇచ్చారని తెలిసింది. ఆమెకు ప్రత్యేకంగా 8 వజ్రాలు పొదిగిన ఓ కాస్ట్లీ బ్యాండ్‌ను బహూకరించారటా!
ఇందులో ప్రత్యేకమేమిటంటే 8 సంఖ్య. ఆ సంఖ్య కపూర్ కుటుంబానికి లక్కీ నంబర్ అంట. మరోవైపు ఆలియాకు కూడా ఎనిమిది సంఖ్య లక్కీ నంబరు అని తెలిసింది. అందుకే కాబోయే శ్రీమతికి ఎనిమిది వజ్రాలు పొదిగిన బ్యాండ్‌ను రణ్‌బీర్ బహూకరించారని అంతా మాట్లాడుకుంటున్నారు. ఘనంగా జరుగుతున్న ఈ పెళ్లి వేడుకకు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, వరుణ్ ధావన్, అయాన్ ముఖర్జీ, జోయా అక్తర్, అర్జున్ కపూర్, మసాబా గుప్తా, కరణ్ జోహార్, కరీష్మా కపూర్, కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు.
ఇదీ చూడండి:ఆలియా- రణ్‌బీర్ వెడ్డింగ్ వైబ్స్.. సెలబ్రిటీల సందడి!