తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

MR.Pregnant Collections : 'మిస్టర్​ ప్రెగ్నెంట్​'కు పెరుగుతున్న రెస్పాన్స్​.. ఇప్పటివరకు ఎంత వసూలు చేసిందంటే? - మిస్టర్ ప్రెగ్నెంట్ బడ్జెట్​

MR.Pregnant Collections : బిగ్‌బాస్ తెలుగు ఫేమ్ యంగ్​ హీరో సోహైల్ నటించిన కొత్త చిత్రం 'మిస్టర్ ప్రెగ్నెంట్​'కు రెస్పాన్స్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కలెక్షన్స్ క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఎంత వచ్చాయంటే..

MR.Pregnant  Collections : 'మిస్టర్​ ప్రెగ్నెంట్​'కు పెరుగుతున్న రెస్పాన్స్​.. ఇప్పటివరకు ఎంత వసూలు చేసిందంటే?
MR.Pregnant Collections : 'మిస్టర్​ ప్రెగ్నెంట్​'కు పెరుగుతున్న రెస్పాన్స్​.. ఇప్పటివరకు ఎంత వసూలు చేసిందంటే?

By

Published : Aug 22, 2023, 12:51 PM IST

MR.Pregnant Collections : బిగ్‌బాస్ తెలుగు ఫేమ్ యంగ్​ హీరో సోహైల్ నటించిన కొత్త ప్రయోగాత్మక చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. రీసెంట్​గా ఈ చిత్రం ఆగస్టు 18వ తేదీన విడుదలై పర్వాలేదనిపించే టాక్​ను తెచ్చుకుంది. అయితే ఇప్పుడీ చిత్రానికి రెస్పాన్స్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్​ ఆరంభంలో స్క్రీన్స్​ తక్కువే దొరికినప్పటికీ.. మంచి రెస్సాన్స్ రావడంతో స్క్రీన్ కౌంట్ పెంచుతున్నారని సమాచారం అందింది.

గత మూడు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ వినపడుతోంది. మొదటి మూడు రోజుల్లో యావరేజ్​గా మార్నింగ్ షోకు 25 శాతం, మ్యాట్నీకి 35 శాతం, ఫస్ట్ షోకు 40 శాతం, సెకండ్ షోకు 35 శాతం ఆక్యుపెన్సీ నమోదైందని తెలిసింది. సోమవారం కూడా మంచి ఆక్యుపెన్సీ నమోదైందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

Mr Pregnant Collection Till Now : కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే.. మొదటి రోజు రూ.35 లక్షలు నమోదు చేసిందని తెలిసింది. రెండో రోజు రూ. 40 లక్షలు కలెక్ట్ చేయగా.. మూడో రోజు రూ.45 లక్షల రూపాయలను అందుకుందని సమాచారం అందింది. అంటే తొలి రోజుతో పోలిస్తే.. రెండో, మూడో రోజు ఎక్కువ వసూళ్లను సాధించడం విశేషం. ఇక నాలుగో రోజు సోమవారం నాన్​ వీకెండ్​లో రూ. 20 లక్షల రూపాయలతో సరిపెట్టుకుంది. దీంతో ఇప్పటివరకు ఈ చిత్రం రూ.1.4 కోట్లను వసూలు చేసింది.

Mr Pregnant Cast and Crew : ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ప్ర‌యోగాత్మ‌క క‌థాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీనివాస్ వింజ‌నంపాటి డైరెక్ట్ చేశారు. రూప హీరోయిన్​గా నటించింది. మైక్ మూవీస్ బ్యానర్​పై అప్పి రెడ్డి, రవీరెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి కలిసి సంయుక్తంగా సినిమాను నిర్మించారు. ఇంకా ఈ సినిమాలో సుహాసిని మణిరత్నం, బ్రహ్మాజీ, రజా రవీంద్ర, అలీ, అభిషేక్ రెడ్డి, వైవా హర్ష, స్వప్నిక తదితరులు ఇతర పాత్రలు పోషించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. ప్రవీణ్ పూడి ఎడిటర్​గా వ్యవహరించారు. నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ అందించారు.

200 మంది ప్రెగ్నెంట్ మహిళలకు స్పెషల్ షో.. అదిరిపోయిన రెస్పాన్స్​.. ఇలాంటి పాత్ర చేయాలంటే గట్స్ ఉండాలంటూ..

Mister Pregnant Movie Review : కొత్త కాన్సెప్ట్​తో 'మిస్టర్​ ప్రెగ్నెంట్'.. సినిమా ఎలా ఉందంటే?

ABOUT THE AUTHOR

...view details