Karan Johar Comments On Bollywood: 'పుష్ప', 'ఆర్‌ఆర్‌ఆర్', 'కేజీయఫ్-2' సినిమాలు బాలీవుడ్‌పై దండయాత్ర చేశాయి. అక్కడి బాక్సాఫీస్‌ను కొల్లగొట్టి కోట్ల రూపాయలను వసూలు చేశాయి. కానీ హిందీ సినిమాలు మాత్రం ఒకట్రెండు మినహా అన్నీ బోల్తా కొట్టాయి. పెద్ద హీరోల సినిమాలకు కూడా ప్రేక్షకాదరణ పెద్దగా దక్కలేదు. దీంతో ఇక బాలీవుడ్ పని అయిపోయిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ రూమర్స్‌పై ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ స్పందించారు.
"పనికిరాని చెత్త మాటలు మాట్లాడుతున్నారు. మంచి సినిమాలు ఎప్పుడూ విజయం సాధిస్తాయి. 'గంగూబాయ్ కతియావాడి', 'భూల్ భులాయా 2' సినిమాలు భారీ హిట్ కొట్టాయి. అలాగే 'జుగ్ జుగ్ జియో' మూవీ కూడా బాగానే ఆడింది. సరైన కంటెంట్ లేని సినిమాలు మాత్రమే బెడిసికొడతాయి. అయినా ఇప్పుడు మన దగ్గర చాలా సినిమాలు లైన్‌లో ఉన్నాయి. 'లాల్ సింగ్ చడ్డా', 'రక్షా బంధన్', 'బ్రహ్మాస్త్ర', రోహిత్ శెట్టి మూవీ, ఏడాది చివర్లో సల్మాన్ సినిమా ఉంది. ఈ చిత్రాల కోసం మనం ఎదురుచూడాలి."
-- కరణ్ జోహర్, ప్రముఖ నిర్మాత