Jailer Box Office Collection: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్- నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో విడుదలైన లేటెస్ట్ మూవీ 'జైలర్'. సూమారు 7000 స్క్రీన్‌లపై గురువారం గ్రాండ్‌గా రిలీజైన ఈ మూవీ అద్భుతమైన ఓపెనింగ్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తమిళంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుకెక్కాగా.. తెలుగులోనూ తొలిరోజు కలెక్షన్స్ అంచనాలకు మించి రాబట్టింది.
Jailer Day 1 Collections : తెలుగులో రెండు రాష్టాల్లో కలిపి ఈ సినిమా రూ.13 కోట్లకుపైగా గ్రాస్‌ను, ఏడు కోట్లకుపైగా షేర్‌ను రాబట్టింది. సీడెడ్‌లో రూ.కోటి, ఉత్తరాంధ్రలో రూ.90 లక్షలు, గుంటూరులో రూ. 65 లక్షలు, కృష్ణాలో రూ. 50 లక్షలు మేర కలెక్షన్స్ వచ్చినట్లు తెలిసింది. తెలుగులో రిలీజైన రజనీకాంత్ డబ్బింగ్ మూవీస్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన రెండో సినిమాగా చరిత్రకెక్కింది.
Jailer Movie Opening Collection : ఓ ప్రముఖ సంస్థ వెలువరించిన నివేదిక ప్రకారం 'జైలర్' సినిమా ఇండియాలోని అన్ని భాషల్లో కలిపి తొలి పోజు రూ. 44.50 కోట్లు నెట్ వసూలు చేసిందట. ఈ క్రమలో తొలిరోజు ఈ సినిమా రూ.52 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల టాక్. అందులో తమిళనాడు నుంచి రూ.23 కోట్లు, కర్ణాటక నుంచి రూ.11 కోట్లు, కేరళ నుంచి రూ.5 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి రూ.10 కోట్లు, ఇతర రాష్ట్రాల నుంచి రూ.3 కోట్లు వరకు వసూలు రాబట్టిందని టాక్.