తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు : సుహాస్

కలర్ ఫొటో సినిమాతో ప్రేక్షకులను అలరించి మంచి హీరోగా గుర్తింపు పొందారు నటుడు సుహాస్. తాజాగా ఆయన 'రైటర్ పద్మభూషణ్' సినిమాతో తెరముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. తన చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలను ఆయన పంచుకున్నారు. ఆ సంగతులు తెలుసుకుందాం..

hero Suhas about his writer Padma Bhushan movie
నటుడు సుహాస్‌

By

Published : Jan 27, 2023, 7:16 AM IST

"ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరించే చిత్రం 'రైటర్‌ పద్మభూషణ్‌'. సినిమా చూసి అందరూ బరువైన భావోద్వేగాలు.. మంచి చిరునవ్వులతో బయటకొస్తారు" అన్నారు నటుడు సుహాస్‌. 'కలర్‌ఫొటో'తో తొలి ప్రయత్నంలోనే హీరోగా మెప్పించిన ఆయన.. ఇప్పుడు 'రైటర్‌ పద్మభూషణ్‌'గా వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. షణ్ముఖ ప్రశాంత్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు సుహాస్‌.

  • "ఇది చాలా మంచి కుటుంబ కథా చిత్రం. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రథమార్ధంలో రెండు, ద్వితీయార్థంలో మూడు ట్విస్ట్‌లు వస్తాయి. క్లైమాక్స్‌లో ఇంకా చాలా మంచి ట్విస్ట్‌ ఉంటుంది. ప్రతి మలుపుని ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు. ముఖ్యంగా క్లైమాక్స్‌కు అందరూ కనెక్ట్‌ అవుతారు. ఆశిష్‌ విద్యార్థి, రోహిణీ, గోపరాజు రమణ లాంటి నటులు ఇందులో భాగమవ్వడం మా అదృష్టం".
  • "ప్రశాంత్‌ నా 'కలర్‌ఫొటో' చిత్రానికి సహాయ దర్శకుడిగా చేశాడు. తర్వాత 'ఫ్యామిలీ డ్రామా' సినిమాకి రచయితగా చేశాడు. ఆ తర్వాత తను నాకీ కథ చెప్పాడు. విన్న వెంటనే బాగా నచ్చి చేస్తానని చెప్పా. ఈ సినిమాని మేము 60రోజుల్లో పూర్తి చేయాలనుకున్నాం. కానీ, పక్కా ప్రణాళికతో 43రోజుల్లోనే పూర్తి చేశాం. మేము ట్రైలర్‌లో చెప్పనిది ఒకటి సినిమాలో వస్తుంది. అదేంటన్నది తెరపై చూస్తేనే బాగుంటుంది".
  • "ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు చిన్న పాత్రలు చేస్తే చాలనుకున్నాను. ఇప్పుడు చాలా మంచి పాత్రలొస్తున్నాయి. రచయితల వల్లే చాలా విభిన్నమైన పాత్రలు పోషించే అవకాశం దొరుకుతోంది. ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదని నా మిత్రులతో అంటుంటా. ప్రస్తుతం నేను గీతా ఆర్ట్స్‌2లో ఓ చిత్రం చేస్తున్నా. చిత్రీకరణ పూర్తయింది. అలాగే 'ఆనందరావు అడ్వంచర్స్‌' అనే మరో సినిమా చేస్తున్నా".
  • ఇవీ చదవండి:
  • వెంకీ​ 'సైంధవ్​' కథ రూ.16కోట్ల ఇంజెక్షన్​ చుట్టేనా.. పాప కోసమే పోరాటమా?
  • ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే

ABOUT THE AUTHOR

...view details