తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

గుణశేఖర్‌ ఇంట మోగిన పెళ్లి భాజాలు.. వేడుకగా నిర్మాత నీలిమ నిశ్చితార్థం

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ కుమార్తె.. నిర్మాత నీలిమ ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో రవి ప్రక్యాతో ఆమె నిశ్చితార్థం వేడుకగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Producer Neelima Engagement:
Producer Neelima Engagement:

By

Published : Oct 8, 2022, 2:09 PM IST

Producer Neelima Engagement: ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ ఇంట శుభకార్యం జరిగింది. ఆయన కుమార్తె నీలిమ ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో రవి ప్రక్యాతో నీలిమ నిశ్చితార్థం వేడుకగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

కాబోయే భర్తను పరిచయం చేస్తూ నీలిమ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. "నా జీవితకాల ప్రయాణం మొదలైంది" అని పేర్కొన్నారు. దీంతో ఆమెకు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో తండ్రిబాటలోనే అడుగులు వేసిన నీలిమ నిర్మాతగా మారారు. గుణశేఖర్‌ తెరకెక్కించిన 'రుద్రమ దేవి'కి సహ నిర్మాతగా వ్యవహరించిన నీలిమ.. ఇప్పుడు 'శాకుంతలం' చిత్రానికి నిర్మాతగా చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details