నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన చిత్రం 'దసరా'. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరికూరి నిర్మించారు. ఈ మూవీ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా విడుదలను పురస్కరించుకొని ప్రచారాన్ని ముమ్మరం చేసింది చిత్ర బృందం. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసింది. తాజాగా ఈ చిత్రంలోని 'చమ్కీల అంగీలేసి..' అంటూ సాగే మూడో పాటను విడుదల చేసింది. పెళ్లి సన్నివేశంలో నాని, కీర్తి సురేష్ మధ్య సాగే ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా.. సంతోష్ నారాయణ సంగీతంలో రామ్ మిరియాల, ధీ ఆలపించారు. అయితే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రతి పదంలో తెలంగాణ యాస ఉట్టిపడింది.
రచ్చకెక్కిన నాని, కీర్తి సురేశ్ పంచాయితీ.. చాడీలు చెప్పుకున్న తారలు
నటుడు నాని, కీర్తి సురేశ్ పంచాయితీ రచ్చకెక్కింది. ఓ పెళ్లి సందర్భంగా ఇద్దరూ ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకున్నారు. ఈ మేరకు తాజాగా విడుదలైన 'దసరా' సినిమా పాటలో ఈ ఇద్దరు తారలు ఆడిపాడారు. మరోవైపు, ఓ హత్య కేసు ఎటూ తేలక సతమవుతున్నారు హీరో ఆది సాయికుమార్. ఆయన నటించిన 'సీఎస్ఐ సనాతన్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో.. మూవీ విశేషాలు పంచుకుంది చిత్ర బృందం.
తెలంగాణలోని గోదావరిఖనిలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో 'దసరా' తెరకెక్కుతోంది. ఈ చిత్రంతో శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు ముందు శ్రీకాంత్.. 'రంగస్థలం', 'నాన్నకు ప్రేమతో' లాంటి చిత్రాలకు అస్టిటెంట్ డెరెక్టర్‌గా పని చేశారు. కాగా, ఈ మూవీలో ధరణి అనే పాత్రలో నాని నటించగా.. వెన్నెలగా కీర్తి సురేష్ కనిపించనుంది. మరోవైపు ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో విలన్ పాత్ర పోషించారు.
క్లూస్ వేటలో 'సనాతన్'
ఓ వ్యక్తి హత్యకు సంబంధించి క్లూస్ టీం ఎలాంటి నిజాలు బయటపెట్టిందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం 'సీఎస్ఐ సనాతన్'. ఇందులో కథానాయకుడు ఆది సాయికుమార్ మెయిన్ లీడ్‌లో నటించారు. శివశంకర్ దేవ్ దర్శకత్వంలో చాగంటి ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ శ్రీనివాస్ నిర్మించారు. ఈ చిత్రం మార్చి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో దర్శక నిర్మాతలు, నటీనటులు చిత్ర విశేషాలతోపాటు తమ అనుభవాలను పంచుకున్నారు. తమిళ, మలయాళంలో ఈ తరహా కథలు ఎక్కువగా వస్తుంటాయని.. తెలుగులో సమాజానికి ఉపయోగపడే ఒక మంచి అంశాన్ని సీఎస్ఐ 'సనాతన్' లో చూపించబోతున్నట్లు కథానాయకుడు ఆది సాయికుమార్ తెలిపారు. కాగా, ఈ చిత్రంలో ఆదికి జోడిగా మిషానారంగ్ నటించారు. నందిని రాయ్, తారక్ పొన్నప్ప, అలి రజా కీలక పాత్రలు పోషించారు. యూ/ఏ సర్టిఫికెట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తమ చిత్రానికి టికెట్ ధరలు తగ్గించినట్లు చిత్ర బృందం వెల్లడించింది.