బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకు ఉండే ప్రేక్షకాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని భాషల ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ విజయవంతంగా దూసుకుపోతోంది. ఇక తెలుగులో ఇప్పటికే 5 సీజన్లు పూర్తిచేసుకున్న ఈ షో.. ప్రస్తుతం ఆరో సీజన్లో ఉంది. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. హౌస్‌మేట్స్ అంతా తమదైన శైలిలో వినోదం పంచుతున్నారు.
అయితే ఈ సీజన్ హౌస్‌లోకి 21 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక మొదటివారం ఎలిమినేషన్ ప్రక్రియ లేదన్న బిగ్‌బాస్ రెండో వారం డబుల్ ఎలిమినేషన్‌తో ఒక్కసారిగా షాకిచ్చాడు. దీంతో గతవారం షాని, అభినయ శ్రీ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఇప్పుడు మూడో వారం నడుస్తోంది. అయితే షో మొదటి నుంచి ఓ కుర్రాడు అందరి ఇంటిసభ్యులకు తన ఆట తీరుతో చుక్కలు చూపిస్తున్నాడు.