తెలంగాణ

telangana

ETV Bharat / crime

Viral Video : పేకాట ఆడుతున్నారని చిన్నారులను నగ్నంగా చేసి.. ఆపై - తెలంగాణ నేర వార్తలు

Attack on Children Viral Video: చిన్నపిల్లలు తప్పు చేస్తే దండించడం ఎక్కడైనా జరిగేదే.. అది కూడా మరీ పెద్ద శిక్షలు కాకుండా.. చెంప దెబ్బలు కొట్టడం.. గోడ కుర్చీలు వేయించడం.. కర్రతో రెండు దెబ్బలు కొట్టడం. ఇంతకు మించి ఎక్కువగా శిక్షించడానికి ఎవరికీ మనసొప్పదు. కానీ ఇక్కడ మాత్రం కొంతమంది చిన్నారులపై పైశాచికంగా ప్రవర్తించారు కొందరు యువకులు. వారిని నగ్నంగా చేసి విచక్షణారహితంగా దాడి చేశారు. గత నెల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

attacked on children
చిన్నారులను నగ్నంగా దాడి

By

Published : May 5, 2022, 9:56 AM IST

పేకాట ఆడుతున్నారని చిన్నారులపై దాడి.. నగ్నంగా చేసి

Attack on Children Viral Video: హైదరాబాద్​ మంగళ్​హాట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో గత నెల 29న జరిగిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారులు పేకాట ఆడుతున్నారనే కారణంతో వారిని నగ్నంగా చేసి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. వీడియో వైరల్​ కావడంతో పోలీసుల దృష్టికి చేరింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

గత శుక్రవారం ధూల్​పేట్​ పరిధిలోని ఓ కొండపై 16 మంది చిన్నారులు పేకాట ఆడుతున్నారు. ఇది గమనించిన ముగ్గురు యువకులు.. వారిని నగ్నంగా చేశారు. అనంతరం చిన్నారులపై విచక్షణారహితంగా కర్రతో దాడికి పాల్పడ్డారు. ముగ్గురిలో మరో యువకుడు.. ఆ వీడియోను తన చరవాణిలో చిత్రీకరించాడు.

సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్​ కావడంతో తెలుసుకున్న ఓ చిన్నారి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులకు నోటీసులు పంపించారు. కాగా చిన్నారులను భాజపా నాయకులే కొట్టారని సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్​ కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. భాజపా నాయకులకు, నిందితులకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కేసు విచారణలో ఉందని.. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

ఇవీ చదవండి:Rape Attempt on a Maid : పనిమనిషిపై యువకుడి అత్యాచారయత్నం

బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్.. స్కూల్​ నుంచి వస్తుండగా..

ABOUT THE AUTHOR

...view details