ఇసుక అక్రమ రవాణాను గ్రామస్థులు అడ్డుకున్న ఘటన... సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని తాటిపాములలో జరిగింది. నాలుగు రోజులుగా ఇసుకను తరలిస్తున్నారని... వాగులో చెక్ డ్యాం నిర్మాణ పనులు చేస్తున్నారనుకొని తాము పట్టించుకోలేదని గ్రామస్థులు తెలిపారు. కాని ఆ ఇసుకను ఇతర పనుల కోసం తరలిస్తుండటంతో అడ్డుకున్నట్లు పేర్కొన్నారు.
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న గ్రామస్థులు - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని తాటిపాముల గ్రామ పరిధిలోని బిక్కేరు వాగు నుంచి గుత్తేదారులు ఇసుక అక్రమంగా తరలిస్తుండగా గ్రామస్థులు శనివారం అడ్డుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇసుక తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న గ్రామస్థులు
ఇసుక తరలింపు విషయంలో హద్దులు నిర్ణయించే వరకు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సరిహద్దు గ్రామాల నుంచి కొందరు అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు చెప్పారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇసుక తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు అందిస్తోన్న ఇద్దరు అరెస్ట్