ఘర్షణ.. కత్తులతో పొడుచుకున్న యువకులు - mulugu news

17:56 January 03
ఘర్షణ.. కత్తులతో పొడుచుకున్న యువకులు
two Young men stabbed each other: ఇద్దరు యువకులు పరస్పరం కత్తులతో పొడుచుకున్న ఘటన ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో చోటుచేసుకుంది. యువకుల మధ్య చిన్నగా మొదలైన ఘర్షణ కత్తులతో పొడుచుకునే వరకు వచ్చింది. ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. వారిని స్థానికులు ఏటూరునాగారం ఆస్పత్రికి తరలించారు.
పాతకక్షలే గొడవకు కారణమని గ్రామస్థులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గొడవకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: