Gang Rape of a Minor Girl in Nellikuduru: 13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఇటీవలే.. ప్రభుత్వ విద్యాసంస్థలో 6 వ తరగతిలో ప్రవేశం పొందింది. కాగా.. బాలికపై ఇద్దరు మైనర్ బాలురు, ఓ వ్యక్తి కలిసి కొద్ది నెలల కిందట అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు తెలిసింది.
ఆరో తరగతి బాలికపై సామూహిక అత్యాచారం, గర్భం దాల్చటంతో వెలుగులోకి
Gang Rape of a Minor Girl in Nellikuduru ఆరోతరగతి చదువుతున్న బాలికపై ఇద్దరు మైనర్లు, ఓ మేజర్ కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వల్ల బాలిక గర్భం దాల్చటంతో అసలు విషయం బయటపడింది.
two minors and one major Gang raped sixth class girl in mahaboobabad
విషయం తెలిసిన వెంటనే బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బాధితురాలిని మహబూబాబాద్‌లోని బాలికల సంరక్షణా కేంద్రానికి తరలించారు. ఈ విషయంపై నెల్లికుదురు పోలీసులను వివరణ కోరగా సమాధానం దాటవేశారు. విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
ఇవీ చూడండి..మునుగోడు ప్రచారంతో నాకేం సంబంధమన్న కోమటిరెడ్డి