తెలంగాణ

telangana

By

Published : Feb 3, 2021, 11:46 AM IST

ETV Bharat / crime

ముత్యాలమ్మ గుడిలో చోరీ.. ఇదిగో వీడియో..

ఓ దొంగ ఏకంగా ఆలయంలోనే చోరీ చేశాడు. అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో గుడి తలుపులు పగులగొట్టి... హుండీలోని నగదును, విలువైన సామన్లను దోచుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి.

ముత్యాలమ్మ గుడిలో చోరీ.. ఇదిగో వీడియో..
ముత్యాలమ్మ గుడిలో చోరీ.. ఇదిగో వీడియో..

ముత్యాలమ్మ గుడిలో చోరీ.. ఇదిగో వీడియో..

సికింద్రాబాద్‌ మోండా మార్కెట్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయంలో దొంగతనం జరిగింది. హుండీలో ఉన్న నగదును దొంగలు దోచుకెళ్లారు. అర్ధరాత్రి సమయంలో చోరీకి పాల్పడ్డారు. దేవాలయ తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం హుండీని పగులగొట్టి.. అందులో ఉన్న విలువైన వస్తువులను, నగదును అపహరించారు.

ఉదయాన్నే స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి పోలీసులు చేరుకున్నారు. చోరీ జరిగిన తీరును పరిశీలించారు. దొంగతనం చేసే దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చోరీకి పాల్పడింది స్థానికులేనా.. లేక బయట వ్యక్తుల అనే కోణంలో విచారణ ప్రారంభించారు.

ఇదీ చదవండి:ఓటీపీతో రేషన్.. సామాన్యులకు తప్పని పరేషాన్...

ABOUT THE AUTHOR

...view details