యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రహీంఖాన్‌పేటకు చెందిన అన్నెపురం పవన్‌కుమార్ అనే యువకుడు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత సంవత్సరం తండ్రి అనారోగ్యంతో మరణించగా.. తల్లితో కలిసి ఉంటున్నాడు. నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నాడు. శనివారం అర్ధరాత్రి ఆరోగ్యం క్షీణించడంతో 108కు ఫోన్ చేయగా.. అంబులెన్స్ వచ్చేసరికే మరణించాడు.
ఎస్సై మానవత్వం.. కరోనా మృతదేహానికి అంత్యక్రియల నిర్వహణ - yadadri district crime news
కరోనాతో చనిపోయిన యువకుని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి ఓ ఎస్సై తన మానవత్వాన్ని చాటుకున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో కొవిడ్ నిబంధనల మేరకు అంత్యక్రియలు పూర్తి చేశారు. నా అన్నవారే దూరంగా ఉన్నవేళ.. నేనున్నానంటూ ఆఖరి మజిలీ పూర్తి చేశారు.

died of corona
కరోనాతో మృతి చెందడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. ఫలితంగా ఆత్మకూరు ఎస్సై ఇద్రియాస్ అలీ గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు నిర్వహించారు.