తెలంగాణ

telangana

By

Published : Mar 26, 2021, 9:09 AM IST

ETV Bharat / crime

ఆర్టీసీ బస్సులో 14.8 కిలోల పుత్తడి పట్టివేత

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడి వద్ద 14.8 కిలోల బంగారం దొరికింది. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు మండలం పంచలింగాల సరిహద్దు వద్ద చెక్​పోస్ట్ వద్ద ఎస్​ఈబీ అధికారులు ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో ..దానిని సీజ్ చేశారు.

gold seized, 14.8kg gold
ఆర్టీసీ బస్సులో 14.8 కిలోల పుత్తడి పట్టివేత

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు మండలం పంచలింగాల సరిహద్దు వద్ద చెక్​పోస్ట్ వద్ద స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారుల తనిఖీలలో భాగంగా గురువారం తెల్లవారుజామున 14.8 కిలోల బంగారం దొరికింది. రాష్ట్రం నుంచి ఏపీలోని కర్నూలు వస్తున్న ఆర్టీసీ బస్సును ఆపి తనిఖీ చేయగా... రాజు అనే ప్రయాణికుడి సంచిలో బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి.

అతనిని విచారించగా తాను అనంతపురం జిల్లా తాడిపత్రిలోని రాయలసీమ బులియన్ కమ్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే నగల దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తానని, తన యజమాని రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాదులోని ఓ బంగారు దుకాణం నుంచి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఆధారాలు సరిగా లేకపోవడంతో బంగారాన్ని సీజ్ చేసి కర్నూలు పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:యూట్యూబ్‌ చూస్తూ అబార్షన్లు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details