ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల శ్రీనివాసనగర్‌లో ఉన్న కరూర్ వైశ్య బ్యాంక్‌లో రూ.90 వేల నగదును గడివేములకు చెందిన నరసింహుడు, సోమన్న అనే వ్యక్తులు డ్రా చేశారు. ఆ నగదును ద్విచక్ర వాహనానికి ఉన్న బ్యాగులో ఉంచారు. అనంతరం కాళికాంబ ఆలయం వద్దకు చేరుకున్నారు.
ద్విచక్రవాహనం బ్యాగ్‌లోంచి రూ.90వేలు చోరీ.. సీసీటీవీలో దృశ్యాలు
ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ షాపు ఎదుట నిలిపి ఉంచిన.. ద్విచక్రవాహన బ్యాగులో నుంచి నగదును చోరీ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో లభ్యమయ్యాయి. ప్రస్తుతం అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
చోరీ
ద్విచక్రవాహనం ఆపి నూనె కొనుగోలు చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో మరో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దొంగలు బైక్ బ్యాగులో ఉన్న నగదును దోచుకెళ్లారు. బాధితులు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నగదు దోసుకెళ్లిన సంఘటనా దృశ్యాలు.. సీసీ కెమెరాకు చిక్కాయి.
ఇదీ చదవండి:'వివేకా హత్య కేసులో సిట్‌పై ఏబీవీవి నిరాధార ఆరోపణలు'