Rape on minor: పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ అమ్మాయిని మాయమాటలతో.. వేరే ఊరికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా వల్లూరు మండలానికి చెందిన 17ఏళ్ల బాలిక కడపలోని ఓ ప్రైవేటు నర్సింగ్ కళాశాలలో స్టాఫ్ నర్స్ కోర్సు చదువుతోంది. నాలుగు రోజుల కిందట పరీక్ష రాసేందుకు కడపకు వచ్చింది. బాలిక కదలికలను గమనించిన పుల్లూరు మండలానికి చెందిన శివకృష్ణ అనే వ్యక్తి ఆమెకు మాయమాటలు చెప్పి రాయచోటికి తీసుకువెళ్లాడు. పరీక్ష కోసం వెళ్లిన తమ కుమార్తె మూడు రోజులైనా ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు కడప ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పరీక్ష రాసేందుకు వచ్చిన అమ్మాయికి మాయమాటలు చెప్పి.. ఆపై..
Rape on minor: పరీక్ష రాసేందుకు పొరుగూరు వచ్చిన ఓ మైనర్ కు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడో ప్రబుద్ధుడు. ఎట్టకేలకు మూడు రోజుల తర్వాత బయటకు వచ్చిన ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన ఏపీలోని కడపలో చోటు చేసుకుంది.
rape-on-minor-in-kadapa-who-came-for-exams
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి బారి నుంచి తప్పించుకువచ్చిన బాలిక.. సోమవారం కడప ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. శివకృష్ణ అనే వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు...పోలీసులు అతనిపై పోక్సో, అత్యాచారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.
ఇవీ చదవండి :
Last Updated : Jun 1, 2022, 6:31 AM IST