తెలంగాణ

telangana

ETV Bharat / crime

మాయమాటలతో మోసాలు... పోలీసుల అదుపులో నిందితుడు!

రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటానని పరిచయం చేసుకున్నాడో ఓ వ్యక్తి . తనకు డబ్బులను రెట్టింపు చేసే వారితో పరిచయాలున్నాయని నమ్మబలికాడు. పెట్టుబడిని రెండింతలు చేసి ఇస్తానన్నాడు. ఇవన్నీ నమ్మి ఓ వ్యక్తి ఏకంగా రూ.4 లక్షలు అతని చేతిలో పెట్టాడు. కొద్దిసేపు ఫోన్లో మాట్లడినట్టు నటించి... అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగింది.

cheater from nalgonda.. arrested in AP
కర్నూలులో నల్గొండకు చెందిన దొంగ అరెస్టు

By

Published : Jun 26, 2021, 9:22 AM IST

మాయమాటలతో ఓ వ్యక్తిని నమ్మించి ఇంట్లో నుంచి రూ.4 లక్షలు తెప్పించుకుని అతనిని ఏమార్చి పరారైన వ్యక్తిని ఏపీలోని కర్నూలు జిల్లా గోస్పాడు మండలం యాళ్లూరులో పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 22న యాళ్లూరులో మంజుల శ్రీనివాసులు హోటల్‌కు ఓ గుర్తుతెలియని వ్యక్తి రాత్రి 8.30కి వచ్చి తాను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటానని పరిచయం చేసుకున్నాడు. 'నీ వద్దనున్న డబ్బులిస్తే రెండింతలు చేసి ఇచ్చేవారు ఉన్నారు' అని నమ్మబలికాడు. అతని మాటలను నమ్మిన శ్రీనివాసులు... ఇంట్లో ఉన్న రూ.4 లక్షలను తెచ్చివ్వగా... అతను కొద్దిసేపు చరవాణుల్లో మాట్లాడినట్లు నటించాడు.

నగదు రెట్టింపు చేసేవారు రావడం ఆలస్యమయ్యేటట్లు ఉందని, కొద్దిసేపు నిద్రపోతానని, బెడ్‌షీటు తెచ్చివ్వాలని శ్రీనివాసులును కోరాడు. అతను బెడ్‌షీట్‌ తెచ్చేందుకు లోపలికి వెళ్లగా ఇదే అవకాశంగా డబ్బుతో సహా ఉడాయించాడు. మోసపోయినట్లు గ్రహించిన శ్రీనివాసులు... పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం నంద్యాల నుంచి చాపిరేవుల హైవే ప్రాంతంలో నిందితుడు ఉండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడు... నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన మహమ్మద్‌ షఫీ (39)గా గుర్తించారు. ఇతను కొత్తపల్లి చక్రి, కొత్తపల్లి మణి, సునీల్‌ అన్న మారుపేర్లు పెట్టుకోవడంతోపాటు చిరునామాలు మారుస్తూ అమాయక ప్రజలను నమ్మించి మోసం చేస్తుంటాడని డీఎస్పీ వివరించారు. నిందితుడు ఉపయోగించిన మోటారు బైకు, కారును స్వాధీనం చేసుకున్నారు. దొంగను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను డీఎస్పీ అభినందించారు.

ఇదీ చదవండి:అధునాతన పినాక రాకెట్ పరీక్షలు విజయవంతం

ABOUT THE AUTHOR

...view details