న్యూడ్ ఫొటోలతో యువతిని వేధిస్తోన్న.. ఓ నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యాప్లో పరిచయమైన ఆ వ్యక్తి.. స్నేహం ముసుగులో బాధితురాలితో మాట కలిపాడు. అలా ఆ వ్యవహారం.. న్యూడ్ ఫొటోలతో ఛాటింగ్ చేసే వరకూ వెళ్లింది. విసిగిపోయిన ఆ యువతి.. జరిగిన విషయం తల్లిదండ్రులకు తెలిపింది.
యాప్లో పరిచయం.. ఆపై యువతికి వేధింపులు - న్యూడ్ ఫొటోలతో యువతిని వేధింపులు
స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ కాసేపటి వినోదం కోసం.. ప్రముఖ యాప్లను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ముక్కు ముఖం తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని వేధింపులు కొని తెచ్చుకుంటున్నారు. ఇలాగే.. ఓ యాప్ ద్వారా యువతితో ఏర్పరచుకున్న పరిచయం.. ఆమెను వేధింపులు ఎదుర్కొనేదాకా తీసుకెళ్లింది. ఈ ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది.

యాప్లో పరిచయం.. ఆపై యువతికి వేధింపులు
బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఐపీ అడ్రస్ ఆధారంగా.. నిందితుడు ముంబయికు చెందిన అమీర్ అహ్మద్ఖాన్గా గుర్తించారు. లొకేషన్ ఆధారంగా అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.