కామారెడ్డి జిల్లా ఉగ్రవాయి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్లిన కారు చెట్టును ఢీకొనటంతో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానికి ఆసుపత్రికి తరలించారు. మృతుడు నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం ముదక్ పల్లికి చెందిన కృష్ణా గౌడ్ (30)గా గుర్తించారు.
మల్లన్నను దర్శించుకుని వస్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి
కామారెడ్డి జిల్లా ఉగ్రవాయి గ్రామ శివారులో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్లి చెట్టును ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఉగ్రవాయి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం
సాగర్ గౌడ్(28),ప్రవీణ్ గౌడ్ (27)ల పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు కొమురవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకుని తిరిగివస్తుండగా తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని దేవునిపల్లి ఎస్ఐ రవి కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి:ఒడిశా గ్యాంగ్స్టర్ ఆనవాళ్లు భువనగిరిలో..