ఉపాధి పనికి వెళ్లిన మహిళ తిరిగొస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పల్లేర్ల గ్రామం సిద్దాపురానికి చెందిన కానుకుంట్ల ముత్తమ్మ (65) రోజులాగానే ఉపాధి పనులకు వెళ్లింది.
పని నుంచి తిరిగివస్తూ ఉపాధి కూలీ మృతి - పనినుంచి తిరిగొస్తూ ఉపాధి కూలీ మృతి
ఉపాధి పనికి వెళ్లిన మహిళ పని ముగించుకుని తిరిగొస్తుండగా అకస్మాత్తుగా పడిపోయి మృతి చెందింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా పల్లేర్ల గ్రామం సిద్దాపురంలో జరిగింది.

యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు
మధ్యాహ్నం వరకు పనిచేసి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తోటి కార్మికులు సపర్యలు చేశారు. అప్పటికే మృతి చెందిందని కూలీలు చెప్పారు.
ఇదీ చూడండి:Cheating: మీసేవా పోర్టల్ హ్యాక్ చేసిన సెక్యూరిటీ గార్డ్