వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థిని మూడో సంవత్సరం విద్యార్థులు ముగ్గురు ర్యాగింగ్ చేయడం కలకలం రేపింది. జాతీయ కోటాలో సీటు సాధించిన మొదటి సంవత్సరం విద్యార్థి ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ కీలక రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తని తెలిసింది. మూడో సంవత్సరం విద్యార్థులు దుస్తులు ఊడదీయించి ర్యాగింగ్ చేయడంతో అతను విషయాన్ని కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లాడు. వారు రాష్ట్ర వైద్య శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడినట్టు సమాచారం. డీఎంఈ రమేశ్‌రెడ్డి బుధవారం వరంగల్ కేఎంసీకి వచ్చి ఆరా తీసినట్లు తెలిసింది. కేఎంసీ ప్రిన్సిపల్ మోహన్‌దాస్‌ను వివరణ కోరగా ర్యాగింగ్ చేసిన వారు క్షమాపణ చెప్పారని, ఈ అంశం సద్దుమణిగిందన్నారు. ఈ చర్యతో బాధిత విద్యార్థి తల్లిదండ్రులు సంతృప్తి పడలేదని తెలిసింది.
Ragging: జూనియర్ విద్యార్థి దుస్తులు ఊడదీయించి సీనియర్ల ర్యాగింగ్ - mbbs first year student was harassed by seniors at kims college
ఎన్ని చట్టాలొచ్చినా.. ఎంత కఠిన చర్యలు చేపట్టినా.. ర్యాగింగ్ భూతం ఇప్పటికీ విద్యార్థులను వదలడం లేదు. ముఖ్యంగా వైద్య కళాశాలల్లో దీని తీవ్రత మరీ ఎక్కువగా ఉంటోంది. తాజాగా కాకతీయ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని థర్డ్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడం కలకలం రేపింది.
జూనియర్ విద్యార్థి దుస్తులు ఊడదీయించి సీనియర్ల ర్యాగింగ్
మరోవైపు.. బాధిత విద్యార్థికి బ్యాక్‌గ్రౌండ్ ఉండటం వల్ల అతడు సేవ్ అయ్యాడని.. సాధారణ విద్యార్థి అయి ఉంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వారని మిగతా విద్యార్థులు అంటున్నారు. యాజమాన్యం, అధికారులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి.. తమకు సీనియర్ల నుంచి రక్షణ కల్పించాలని జూనియర్ విద్యార్థులు కోరుతున్నారు. కఠిన చర్యలు చేపట్టి తమ జీవితాల నుంచి ర్యాగింగ్ భూతాన్ని వదిలించాలని కోరారు.
- ఇదీ చదవండి :'మద్యం కొనేవారిని 'పశువులు'గా చూడకండి'
Last Updated : Sep 17, 2021, 12:18 PM IST