సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని న్యాయమూర్తులకు కులాన్ని ఆపాదిస్తూ.. వారి తీర్పులను తప్పుపడుతూ.. వారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్న అభియోగాలపై ఏపీలోని కడప జిల్లాకు చెందిన లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని సీబీఐ, ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని గుంటూరు 4వ అదనపు జూనియర్ సివిల్ కోర్టు ఎదుట హాజరుపరిచారు. గత కొన్ని నెలల క్రితం కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాన్ని వేదికగా చేసుకుని న్యాయమూర్తులకు కులాన్ని ఆపాదిస్తూ.. వారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని ఉన్నత న్యాయస్థానాలు ఆక్షేపించాయి.
FAKE POSTS: న్యాయమూర్తులపై తప్పుడు పోస్టులు.. సీబీఐ అదుపులో వ్యక్తి!
సామాజిక మాధ్యమాల వేదికగా న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న అభియోగాలపై ఏపీలోని కడప జిల్లావాసిని సీబీఐ, ఏసీబీ అధికారాలు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు 4వ అదనపు జూనియర్ సివిల్ కోర్టు ఎదుట హాజరుపరిచారు.
FAKE POSTS: న్యాయమూర్తులపై ఫేస్బుక్లో తప్పుడు పోస్టులు.. సీబీఐ అదుపులో వ్యక్తి!
హైకోర్టు దీనిని సుమోటోగా స్వీకరించి దర్యాప్తు నిమిత్తం సీబీఐ, ఏసీబీకి అప్పగించింది. అందులో భాగంగా శనివారం కడప జిల్లాకి చెందిన రాజశేఖర్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. గుంటూరు 4వ అదనపు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఈనెల 23వరకు రిమాండ్‌కి తరలిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి:Kilady Ladies: టైలరింగ్ వృత్తి... దొంగతనాలు ప్రవృత్తి