తెలంగాణ

telangana

ETV Bharat / crime

చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్ట్ - చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్​ చేసిన వరంగల్​ పోలీసులు

రాత్రివేళల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కమిషనరేట్ పరిధిలోని వరుస దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి బంగారు, వెండి, నగదు, కారు, టీవీ, చరవాణులు, తల్వార్ స్వాధీనం చేసుకున్నారు.

Gang of thieves arrested for committing thefts in warangal urban district police today
చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్ట్

By

Published : Feb 25, 2021, 9:56 PM IST

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కమిషనరేట్ పరిధిలోని సీసీఎస్, ధర్మసాగర్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 202 గ్రాముల బంగారు, 1.2 కిలోల వెండి, రూ.1.10 వేల నగదు, కారు, ఎల్ఈడీ టీవీ, హోం థియేటర్, స్పీకర్లు, రెండు సెల్‌ఫోన్లు, ఒక తల్వార్ స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠా సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్ వెల్లడించారు.

జల్సాలకు అలవాటుపడి...

ప్రధాన నిందితుడైన తాండ్ర ప్రదీప్ ఆలియాస్ రాయుడు లారీ డ్రైవర్​గా పనిచేస్తున్న సమయంలోనే మద్యం, చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. డబ్బు కోసం ప్రధాన రోడ్డు మార్గాల్లో అగివున్న లారీలోని డీజిల్​ దొంగలించడం ప్రారంభించాడు. 2012 నుంచి స్నేహితులతో కలిసి మంచిర్యాల, కోరుట్ల, జగిత్యాల, సైబరాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ద్విచక్రవాహనాల చోరీ, చైన్ స్నాచింగ్, దోపిడీలు పాల్పడుతూ పలుమార్లు పోలీసులకు దొరికి జైలు జీవితం గడిపాడు. బెయిల్​పై విడుదలై చిల్లర దొంగతనాలు చేసేవాడు.

మరో ఐదుగురితో కలిసి..

నిందితుడు మరో ఐదుగురితో కలిసి ముఠాగా ఏర్పడి రాత్రి సమయాల్లో కారులో ప్రయాణిస్తూ తాళం వేసివున్న ఇళ్ల తాళాలు పగుల గొట్టి చోరీలకు పాల్పడేవారు. ఈ ముఠా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి 11న ఆర్ధరాత్రి ధర్మసాగర్ మండల కేంద్రంలో పది ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. గతేడాది డిసెంబర్​లో జగిత్యాల, మెట్​పల్లి, సిరిసిల్ల, వేములవాడ, నిజామాబాద్, నాగర్ కర్నూల్, యాదగిరి గుట్ట ప్రాంతాల్లో దొంగతనాలు చేశారు.

టెక్నాలజీ ఆధారంగా నిందితుల గుర్తింపు

అందుబాటులో టెక్నాలజీని వినియోగించుకున్న పోలీసులు ముఠా సభ్యుల కదలికలను గుర్తించారు. నిందితులు చోరీ చేసిన సొమ్మును ఆమ్మేందుకు ఈరోజు ఉదయం వెళ్తున్నారనే పక్కా సమాచారంతో సీసీఎస్, ధర్మసాగర్ పోలీసులు... హన్మకొండ- హైదరాబాద్ రింగ్ రోడ్డులోని ధర్మసాగర్ క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో నిందితులు ప్రయాణిస్తున్న కారులో బంగారు ఆభరణాలు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకోన్నారు. దర్యాప్తులో పలుచోట్ల చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారని వరంగల్‌ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు.

ఇదీ చూడండి :కుమురంభీం జిల్లాలో పెద్దపులుల సంచారం!

ABOUT THE AUTHOR

...view details