Student suicide with hanging: ఉరివేసుకొని ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకొంది. ఈ దుర్ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల లేడీస్ హాస్టల్లో జరిగింది. ఇదే కళాశాలలో మూడో సంవత్సరం సీఎస్ఈ చదువుతున్న శ్రావణి(20) అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్లోని తన గది పైన ఉండే ఖాళీ రూమ్‌లోకి వెళ్లి ఫ్యాన్‌కి ఉరి వేసుకుంది. మధ్యాహ్నం భోజనం చేయడానికి ఎంతకీ కిందకి రాకపోవడంతో తోటి విద్యార్థినులు వెళ్లి చూడగా.. ఫ్యాన్‌కు ఉన్న శ్రావణిని గమనించారు.
Btech student suicide: హాస్టల్ గదిలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య..
Engineering student committed suicide: ఏమైందో తెలియదు.. చదువుకోవలసిన సమయంలో ఇలా విగత జీవిలా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఎక్కడి నుంచో వచ్చి.. హైదరాబాద్ సిటీలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తోంది. తమతో కలిసి సందడిగా కళాశాలకు వెళ్లి చదువుకోవలసిన తోటి స్నేహితురాలు ఇలా అవ్వడం చూసి మిగిలిన విద్యార్థినులు ఆవేదనను ఎవరు ఆపగలరు.. ఇంతకీ తను అంతలా నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అసలు.. ఇంతకీ ఈ దుర్ఘటన ఎక్కడ జరిగింది?
యువతి ఆత్మహత్య
వెంటనే విద్యార్థినులు దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. విద్యార్థినుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని మృతిపట్ల విద్యార్థి సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మృతురాలు నిజామాబాద్ పట్టణ వాసిగా గుర్తించారు.
ఇవీ చదవండి: