తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ రావడం లేదని కలత చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సునీల్ నాయక్ మృతి చెందాడు. సునీల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహిస్తున్న సమయంలో మార్చురీ ఎదుట బీజేవైఎం కార్యకర్తలు, భాజపా నాయకులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
'పోరాడి సాధించుకున్నా... ఆత్మహత్యలు మాత్రం ఆగట్లేదు'
పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు రాకపోవడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందంటూ పలు సంఘాల నాయకులు గాంధీ మార్చురీ వద్ద ధర్నాకు దిగారు. సునీల్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆందోళనకారులు ఆరోపించారు. సునీల్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని... వారి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు రాకపోవడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పీఎస్కు తరలించారు. ఈ ఘటనతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇదీ చూడండి:ఆత్మహత్యాయత్నం చేసిన సునీల్ నాయక్ మృతి