మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని మడిపల్లి గ్రామ శివారు సోమవారపు కుంట తండాలో విద్యుదాఘాతంతో కాడెద్దు మృతి చెందింది. తండాకు చెందిన భానోత్ హరికిషన్ కాడెద్దు వ్యవసాయ బావి వద్ద మేత మేస్తోంది. ఆ క్రమంలోనే ట్రాన్స్ఫార్మర్ కింద వేలాడుతున్న విద్యుత్ తీగకు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. చనిపోయిన కాడెద్దు దాదాపు 80 వేల రూపాయల విలువ ఉంటుందని అన్నారు.
Current shock: విద్యుదాఘాతంతో కాడెద్దు మృతి - cow died with current shock at ahabubabad district
మహబూబాబాద్ జిల్లా సోమవారపుకుంట తండాలో విద్యుదాఘాతానికి గురై ఓ కాడెద్దు మృతి చెందింది. తమ ఇంటి సభ్యునిగా భావించి పెంచుకున్న ఎద్దు చనిపోవడం వల్ల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

cow
పెద్ద ఎద్దు చనిపోవడంతో హరికిషన్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. విద్యుత్ అధికారులు స్పందించి... బాధిత కుటుంబ సభ్యులకు పరిహారం వచ్చే విధంగా కృషి చేయాలని గ్రామ సర్పంచ్ యాకమ్మ కోరారు.
ఇదీ చదవండి :Eatala: ఒక్క ఎకరం ఎక్కువ ఉన్నా ముక్కు నేలకు రాస్తా: ఈటల సతీమణి