హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి కిడ్నాప్‌కు గురవ్వడం కలకలం రేపింది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో దేవరకొండ బస్తీలోని రోడ్ నం.3లో.. ద్విచక్ర వాహనాల్లో వచ్చిన ముగ్గురు దుండగులు యువతిని అపహరించారు. బలవంతంగా బైకుపై ఎక్కించడంతో ఆ యువతి రక్షించమంటూ కేకలు వేసింది. వాటిని విన్న స్థానికులు ఇళ్ల నుంచి బయటికి వచ్చి చూసే లోపే దుండగులు అమ్మాయిని తీసుకొని పరారయ్యారు.
బంజారాహిల్స్‌లో యువతి కిడ్నాప్ కేసులో సీసీ ఫుటేజ్ లభ్యం
బంజారాహిల్స్‌లో కిడ్నాప్‌కు గురైన యువతి గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. యువతిని కిడ్నాప్ చేసే దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి.
బంజారాహిల్స్‌లో యువతి కిడ్నాప్ సీసీ ఫుటేజ్
దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. అసలు కిడ్నాప్‌కు గురైన యువతి.. ఎవరై ఉంటారనే వివరాలను ఆరా తీస్తున్నారు. తెలిసిన వాళ్లే బలవంతంగా ఎక్కించుకుని వెళ్లారా..? లేదా మిస్సింగ్ కేసులేవైనా నమోదు అయ్యాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- సంబంధిత కథనం: యువతి కిడ్నాప్.. 'బలవంతంగా బైక్‌పై ఎక్కించుకెళ్లారు'